Header Banner

ఫాస్టాగ్ లో కీలక మార్పు! ఇకపై అన్ లిమిటెడ్ హైవే జర్నీ!

  Sat May 24, 2025 12:00        Others

వాహనదారులకు గుడ్ న్యూస్. ఇకపై హైవే ప్రయాణం మరింత సులభం కానుంది. అంతేకాక ఫాస్టాగ్ లో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమనట్లు తెలుస్తోంది. సంవత్సరంలో ఒకేసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లించి.. అన్ లిమిటెడ్ హైవే ప్రయాణం చేసేందుకు వీలుగా ఓ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విధానంతో వాహనదారుల ప్రయాణం సులభతరం కావడంతోపాటు.. ఇష్టం ఉన్న ప్రదేశాలకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ప్రయాణం చేసే వీలుంటుంది.


టోల్ ప్లాజాల వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫాస్టాగ్ విధానంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమనట్లు తెలుస్తోంది. కొత్త పాలసీలో ముఖ్యంగా రెండు పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

 


ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు!

 

యాన్నువల్ పాస్ పద్ధతి.. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లిస్తే.. సంవత్సరం మొత్తం అన్ లిమిటెడ్ హైవే జర్నీ చేయొచ్చు. సంవత్సరం ఫీజు రూ. 3000 గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఫీజు ఒకేసారి చెల్లిస్తే టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అడ్డంకులు ఉండవు. దేశంలోని ఏ ప్రాంతానికైనా హైవేపై దర్జాగా ప్రయాణించవచ్చు. ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. రెండు.. మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఫీజు చెల్లించవచ్చు. ప్రతి 100 కి.మీ రూ. 50 చెల్లించే విధంగా రూల్స్ పెట్టారు.

 

ఈ కొత్త పాలసీని తీసుకురావడానికి గల కారణం దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఒక్కో మార్పు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మే 1, 2025 నుంచి దేశంలో టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పును అమల్లోకి తెచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంతో పారదర్శకమైన టోల్ వసూళ్లు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi#FASTag #FASTagUpdate #UnlimitedJourney #HighwayTravel #TravelSmart #DigitalPayments #RoadTrip